Thursday, 12 March 2026 12:02:13 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Mohan Babu: మోహన్ బాబు, మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదు

Date : 04 February 2026 07:46 PM Views : 115

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ కిడ్నాప్ కిడ్నాపర్లను గంటన్నరలో పట్టుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణులపై కిడ్నాప్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళితే... తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిధిలో ఉన్న మోహన్ బాబు యూనివర్శిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలు జరుగుతున్నాయంటూ... కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళుతున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నేత వినోద్ లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వ్యక్తులు వీరిని ఓ వాహనంలోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిడ్నాప్ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగిన సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు... కిడ్నాపర్లను వెంబడించారు. గంటన్నరలోనే వారిని పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, వాహనాలను సీజ్ చేశారు. నిందితులను పీఎస్ కి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు... యూనివర్శిటీ పీఆర్వో సతీశ్ ను ఏ1గా, మోహన్ బాబును ఏ2గా, మంచు విష్ణును ఏ3గా చేర్చారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :