Sunday, 08 March 2026 10:53:43 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Hyderabad: అందుకు నో చెప్పడంతో.. హైదరాబాద్‌లో బాలీవుడ్‌ నటిపై దాడి..

హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Date : 24 March 2025 09:38 AM Views : 400

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Hyderabad: హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు నటిని గదిలో బంధించి రూ.50వేలు నగదుతో దుండగులు పరారయ్యారు. బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేయడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో మూసబ్ ట్యాంక్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అయితే, దాడి చేసింది ఎవరు.. వారు ఎక్కడికి వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ముంబయిలో ఉంటున్న ఓ బాలీవుడ్, టీవీ నటి (30యేళ్లు)కి ఈనెల 17న హైదరాబాద్ కు చెందిన ఓ స్నేహితురాలు ఫోన్ చేసి షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని ఆహ్వానించింది. ముంబై నుంచి హైదరాబాద్ కు రానుబోను ప్రయాణ ఖర్చులు భరిస్తారని, పారితోషికం చెల్లిస్తారని చెప్పింది. దీంతో ఈనెల 18వ తేదీన సదరు బాలీవుడ్ నటి హైదరాబాద్ కు చేరుకుంది. మాసబ్ ట్యాంక్ శ్యామ్ నగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో బస చేశారు. అక్కడ ఓ వృద్ధురాలు నటికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. ఈనెల 21న రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు మహిళలు నటి ఉన్న గదికి వెళ్లి తమతో కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు.

అదేరోజు రాత్రి 11గంటల సమయంలో ముగ్గురు పురుషులు నటి ఉన్న గదిలోకి వచ్చి తమతో గడపాలంటూ ఒత్తిడి చేశారు. ఆ తరువాత బలవంతం చేసే ప్రయత్నం చేశారు. దీంతో బాలీవుడ్ నటి గట్టిగా కేకలు వేయడంతోపాటు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనడంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తరువాత ఇద్దరు మహిళలు నటిని గదిలోనే బందించి ఆమె వద్ద ఉన్న రూ.50వేల నగదుతో వెళ్లిపోయారు. నటి 100 ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో మాసబ్ ట్యాంకు పోలీసులు నటిని బంధించిన గదికి చేరుకొని ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :