Sunday, 08 March 2026 09:37:56 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Shobhita Dhulipala: పుకార్లకు చెక్ పెట్టిన శోభిత... పెళ్లి తర్వాత కొత్త సినిమా ప్రకటన

Date : 30 September 2025 07:47 PM Views : 312

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : పెళ్లి తర్వాత సినిమాలకు శోభిత దూరం అంటూ జోరుగా ప్రచారం నటనకు గుడ్‌బై చెప్పిందంటూ వ్యాపించిన వదంతులు ప్రెగ్నెంట్ అంటూ మరో ప్రచారం అన్ని రూమర్లకు చెక్ పెడుతూ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ తమిళ దర్శకుడు పా.రంజిత్ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం నటుడు నాగచైతన్యతో వివాహం తర్వాత నటనకు దూరమయ్యారంటూ తనపై వస్తున్న వదంతులకు నటి శోభిత ధూళిపాళ ఒక్క ప్రకటనతో తెరదించారు. పెళ్లి తర్వాత కొంతకాలంగా సినిమాలకు విరామం తీసుకోవడంతో ఆమె కెరీర్‌పై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ, తాజాగా ఓ క్రేజీ తమిళ ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొంతకాలంగా శోభిత తన కెరీర్‌ను పక్కనపెట్టి, పూర్తిగా వైవాహిక జీవితంపైనే దృష్టి సారించారని ప్రచారం జరిగింది. నాగచైతన్యతో కలిసి అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్లలో కనిపిస్తున్నా, కొత్త సినిమాల ఊసు లేకపోవడంతో ఆమె ఇకపై నటించరనే వార్తలు బలపడ్డాయి. అంతేకాకుండా, ఆమె గర్భవతి అని, అందుకే బయటకు రావడం లేదని కూడా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వ్యాపించాయి. ఈ ఊహాగానాలన్నింటికీ ముగింపు పలుకుతూ, శోభిత ఓ భారీ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. విలక్షణ దర్శకుడిగా పేరుగాంచిన తమిళ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ చిత్రంలో హీరోగా దినేష్ నటిస్తుండగా, మరో ప్రముఖ నటుడు ఆర్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్టుతో, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగించాలనే విషయంలో శోభిత చాలా స్పష్టంగా ఉన్నారని అర్థమవుతోంది. దీనికి నాగచైతన్య నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోందని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విభిన్నమైన కథలతో సినిమాలు తీసే పా. రంజిత్ చిత్రంలో శోభిత పాత్ర ఎలా ఉండనుందోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :