Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Prabhas : ప్రభాస్ ఫ్యామిలీ మర్యాదల గురించి అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎక్కడా తగ్గరు. ఇంటికి ఎవరు వచ్చినా కడుపునిండా ఫుడ్ పెట్టి పంపిస్తారు. ఇక ప్రభాస్ అయితే తన సినిమాలో పనిచేసే నటీనటులకు రకరకాల ఫుడ్ తో తన మర్యాదల రుచి చూపిస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీలు, ప్రభాస్ తో పనిచేసినవాళ్లు ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి మాట్లాడిన వాళ్ళే. తాజాగా జనక అయితే గనక సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సందీప్ ప్రశాంత్ నీల్ దగ్గర రైటర్ గా, దర్శకత్వ శాఖలో సలార్ సినిమాకు పనిచేసాడు. ఈ క్రమంలో ప్రభాస్ తో కూడా కలిసి పనిచేసాడు. ఇటీవల తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి ప్రభాస్ తో తన ట్రావెలింగ్, ప్రభాస్ మర్యాదల గురించి మాట్లాడారు. సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. సలార్ సినిమా డిస్కషన్స్ లో ప్రభాస్ గారితో కలిసి పనిచేసాను. ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్, నేను, హనుమాన్ అని ఇంకో రైటర్ ప్రీ ప్రొడక్షన్స్ లో దాదాపు ఒక 100 రోజులు కూర్చొని కలిసి పనిచేసాము. ప్రభాస్ గారి చీట్ మీల్ రోజు అయితే ఇక ఫుడ్ లెక్కే ఉండదు. ఆ మర్యాదలు ఏంటో.. వంశపారంపర్యంగా వచ్చి ఉండాలి. ఆయన గుణం ఎవరికీ ఉండదు, ఆయన ఎవరికీ ఋణం ఉండడు. వీళ్ళ మర్యాదలు చూస్తే బహుశా అక్షయపాత్ర వీళ్ళ వంశానికే చెందింది అయి ఉండాలి. ఎంతమంది వెళ్తే అంతమందికి ఫుడ్ పెడతారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అని సామెత ఉంది కానీ ఈయన అడక్కపోయినా పెడతారు, అమ్మ కంటే కూడా ఆప్యాయంగా పెడతారు. ఆయన నాకు చాలా కనెక్ట్ అయ్యారు అని అన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సందీప్ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు.
Admin
Studio18 News