Monday, 15 December 2025 02:15:47 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

వెళ్లి మోదీకి చెప్పు అని అన్నాడు... ఆమె చెప్పింది: వర్మ

Date : 08 May 2025 12:35 PM Views : 287

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : జ‌మ్మూక‌శ్మీర్‌ పహల్గామ్‌లో అమాయ‌కులైన‌ 26 మంది ప‌ర్యాట‌కుల ప్రాణాలు తీసిన ఉగ్ర‌మూక‌ల‌కు భార‌త్ ‘ఆపరేషన్ సిందూర్‌’తో బుద్ధి చెప్పిన విష‌యం తెలిసిందే. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న దాయాది పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ డిమాండ్ చేశారు. దీంతో భార‌త సైన్యం ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరిట ఉగ్ర‌వాదులపై విరుచుకుపడింది. పీఓకేతో పాటు పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేప‌ట్టింది. కీలకమైన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేల‌మ‌ట్టం చేసింది. దీనిపై భార‌తీయులు అంద‌రూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. భార‌త ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’పై దేశ ప్రజల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. అదేవిధంగా సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా భారత సైనికుల ధైర్య సాహసాలను అభినందిస్తూ... ఆపరేషన్ సిందూర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, తార‌క్‌, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లాంటి ప్రముఖులంతా సైనికులకి మద్దతు తెలుపుతూ పోస్ట్ చేశారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ‘ఆపరేషన్ సిందూర్‌’పై 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. ఆయ‌న‌ పాక్ ఉగ్రవాదులపై సెటైరికల్ గా కామెంట్స్ చేశారు. పహల్గామ్‌ దాడిలో ఉగ్రవాదులు ఒక మహిళ భర్తని చంపి.. వెళ్లి మోదీకి చెప్పు అని అన్నారు. ఇప్పుడు ఆ మహిళ నిజంగానే మోదీకి చెప్పింది అంటూ ఆర్‌జీవీ సెటైరికల్‌గా ట్వీట్ చేయ‌డంతో అది కాస్త‌ వైర‌ల్‌గా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :