Saturday, 24 January 2026 09:09:04 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

Rukmini Vasanth: 'మదరాసి'లో మనసు దోచే రుక్మిణి వసంత్!

Date : 04 September 2025 06:46 PM Views : 274

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రేపు విడుదలవుతున్న 'మదరాసి' టైటిల్ తోనే మార్కులు కొట్టేసిన మూవీ ప్రత్యేకమైన ఆకర్షణగా రుక్మిణి వసంత్ యూత్ లో పెరిగిపోయిన ఫాలోయింగ్ ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే చాన్స్ ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నప్పటికీ, హీరోల కంటే హీరోయిన్స్ వైపు నుంచే ఎక్కువ పోటీ ఉంటుంది. ఇక్కడ జోరు చూపించే ఛాన్స్ గ్లామరస్ హీరోయిన్స్ కి ఎక్కువగా ఉంటుంది. నటన పరంగా కూడా ఫాలోయింగ్ పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు .. కాకపోతే చాలా తక్కువ. అలాంటి అరుదైన కథానాయికల జాబితాలో రుక్మిణి వసంత్ ఒకరుగా కనిపిస్తుంది. తెరపై కాస్త పద్ధతిగా కనిపించే పాత్రలైతేనే చేస్తాను అనే హీరోయిన్స్ జోలికి వెళ్లడానికి చాలా పాత్రలు భయపడతాయి. అందువలన ఈ తరహా హీరోయిన్స్ ఎక్కువ ప్రాజెక్టులలో కనిపించరు. అయినా చేసిన పాత్రలతోనే మంచి పేరు కొట్టేస్తూ ఉంటారు. ఆ జాబితాలో నిత్యామీనన్ .. సాయిపల్లవి వంటివారు కనిపిస్తూ ఉంటారు. ఆ తరువాత స్థానంలో ఇప్పుడు రుక్మిణి వసంత్ కనిపిస్తోంది. సంప్రదాయ బద్ధంగా కనిపించే ఈ బ్యూటీకి ఇప్పుడు అభిమానుల సంఖ్య ఎక్కువే. అలాంటి ఈ సుందరి ఇప్పుడు 'మదరాసి' సినిమాతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దక్షిణాదివారిని ఉత్తరాదివారు 'మదరాసి' అని పిలుస్తూ ఉంటారు. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఉత్తరాదికి చెందిన వ్యక్తి .. అతను హీరోను 'మదరాసి' అని పిలుస్తూ ఉంటాడు. అందువల్లనే తాను ఈ సినిమాకి ఈ టైటిల్ ను పెట్టినట్టుగా మురుగదాస్ చెప్పాడు. తమిళనాడులో నార్త్ ఇండియా మాఫియాకి .. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయనీ, యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి హైలైట్ నిలుస్తాయని మురుగదాస్ చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. శివకార్తికేయన్ జోడిగా రుక్మిణి వసంత్ మంచి మార్కులు కొట్టేయడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆమె కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని అంటున్నారు మరి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :