Saturday, 17 January 2026 09:58:35 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

‘వార్-2’పై మైత్రీ మూవీ మేక‌ర్స్ ఆస‌క్తిక‌ర పోస్ట్‌.. అభిమానుల‌కు ఒకింత నిరాశ క‌లిగించే న్యూస్‌!

Date : 17 May 2025 01:20 PM Views : 297

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ నెల 20న‌ త‌న పుట్టిన‌రోజు జ‌రుపుకోనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ల‌వ‌ర్స్.. అత‌డి సినిమాల అప్‌డేట్‌ల కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే తార‌క్ న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘వార్-2’ నుంచి బ‌ర్త్‌డే నాడు స్పెష‌ల్ అప్‌డేట్ ఉండ‌బోతుంద‌ని అటు హృతిక్ రోష‌న్‌తో పాటు ఇటు చిత్ర‌నిర్మాణ సంస్థ య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ ప్ర‌క‌టించాయి. అయితే, ‘వార్-2’తో పాటు తార‌క్-ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా అప్‌డేట్ వ‌స్తుంద‌ని అంద‌రూ ఊహించారు. కానీ, ఎన్‌టీఆర్ బ‌ర్త్‌డే నాడు ఈ మూవీ నుంచి ఎటువంటి అప్‌డేట్ ఉండ‌ద‌ని నిర్మాన సంస్థ తాజాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌కటించింది. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. “ఇది పూర్తిగా ‘వార్-2’ సమయం. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు. దీన్ని (WAR 2) సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్-2’తో చేసుకోండి” అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా మైత్రీ మూవీ మేకర్స్... తార‌క్‌-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఉండదని స్పష్టం చేసింది. ‘వార్-2’ విడుదల సమయంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ సినిమాకు సంబంధించిన మాస్ అప్‌డేట్‌ను సరైన సమయం వచ్చినప్పుడు అందిస్తామని పరోక్షంగా తెలిపింది. ఇక‌, హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ‘వార్-2’ రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా... అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్ డే రోజున గ్లింప్స్ విడుద‌ల‌ చేయనున్నట్లు స‌మాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :