Wednesday, 17 December 2025 02:18:58 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

: రాజమౌళి మార్క్ విలన్.. భయపెడుతున్న 'కుంభ' ఫస్ట్ లుక్!

Date : 07 November 2025 07:01 PM Views : 145

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమా నుంచి కీలక అప్‌డేట్ ఎస్ఎస్ఎంబీ29లో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ విడుదల 'కుంభ' అనే ప్రతినాయకుడి పాత్రలో మలయాళ స్టార్ అభిమానులను ఆకట్టుకుంటున్న క్రూరమైన లుక్ ఈ నెల‌ 15న జరగనున్న 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్.. ముందే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఎస్.ఎస్. రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్‌ బాబు. వీరిద్దరి కలయికలో రాబోతున్న భారీ చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ29’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ 'కుంభ' అనే పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్‌లో ఆయన లుక్ అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ చిత్రంలో మహేశ్‌ బాబుకు దీటైన ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ నటించనున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఫస్ట్ లుక్‌తోనే రాజమౌళి చెప్పకనే చెప్పారు. ఈ నెల‌ 15న ఈ సినిమాకు సంబంధించి 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్ లేదా ఇతర వివరాలు వెల్లడిస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ ఈవెంట్‌కు ముందే ఇలా సడన్‌గా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి రాజమౌళి అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ ఒక్క లుక్‌తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :