Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ కి పరిచయమైన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర సినిమాలో కాసేపే కనిపించినా తన అందాలతో అలరించింది. దేవర ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఓ ఆసక్తికర విషయం తెలిపింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నేను జుట్టు లేకుండా నటించాల్సి వస్తే అస్సలు నటించను. నేను ఆ పాత్రలకు ఒప్పుకోను. ఎంత కష్టమైనా భరిస్తాను కానీ జుట్టు మాత్రం కట్ చేసుకోను. నా మొదటి సినిమా దఢక్ కోసం కొంచెం జుట్టు కట్ చేశాను. అప్పుడు అమ్మ కోప్పడింది. ఏ రోల్ కోసం అయినా సరే జుట్టును మాత్రం కట్ చేసుకోవద్దని చెప్పింది. ఆమె మాట నేను జవదాటను. అందుకే జుట్టు లేకుండా ఉండే పాత్రలు వస్తే చేయను అని తెలిపింది. దీంతో తన దగ్గరికి తీసుకు వచ్చే పాత్రల్లో జుట్టు కట్ చేసుకోవాలని చెప్పే పాత్రలు ఉంటే రావొద్దని డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేసింది దర్శక నిర్మాతలకు. దేవర తర్వాత జాన్వీ రామ్ చరణ్ తో RC16 సినిమా, బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది.
Admin
Studio18 News