Sunday, 08 March 2026 10:27:14 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Ram Charan: మెగా అభిమానులకు తీపి కబురు.. మళ్లీ తండ్రి కాబోతున్న రామ్ చరణ్

Date : 23 October 2025 07:55 PM Views : 266

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : మరోసారి తల్లి కాబోతున్న రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన నివాసంలో ఘనంగా జరిగిన సీమంతం వేడుక హాజరైన మెగా, కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు వేడుకలో పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా ప్రత్యేక ఆకర్షణ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతుల ఇంట మరోసారి సంతోషం వెల్లివిరిసింది. ఉపాసన రెండోసారి గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ శుభవార్తను ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా తన నివాసంలో జరిగిన వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను ఉపాసన పంచుకున్నారు. ఆ వీడియో ద్వారా తాను గర్భవతిననే విషయాన్ని ఆమె సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ వార్త బయటకు వచ్చిన కొన్ని రోజులకే, ఆమె కోసం కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. ఈ కార్యక్రమం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన తల్లిదండ్రులు, కామినేని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవాతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ సీమంతం వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :