Saturday, 07 March 2026 08:14:17 PM
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు # వరంగల్ జేపీఎన్ రోడ్డులో ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం # మందమర్రి CER క్లబ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Anaganaga Australia Lo : అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ రివ్యూ..

అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ఓ స్కామ్ లో ఇరుక్కొని హీరో, హీరోయిన్ ఎలా బయటకు వచ్చారు అని సాగే సస్పెన్స్ థ్రిల్లర్.

Date : 22 March 2025 11:05 AM Views : 372

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Anaganaga Australia Lo Movie Review : జ్యోతినాథ్‌ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్‌ చెరుకూరి, చంద్ర కొమ్మాలపాటి.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా అనగనగా ఆస్ట్రేలియాలో. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బీటీఆర్ శ్రీనివాస్‌ నిర్మాణంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న మార్చి 21న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కథ విషయానికొస్తే.. హీరో(జ్యోతినాథ్‌ గౌడ్) ఆస్ట్రేలియాలో ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. హీరోయిన్(సాన్య భట్నాగర్) ఆస్ట్రేలియాలో చదువుకుంటూ తన చదువు కోసం చిన్న చిన్న అసైన్‌మెంట్స్ రాసి డబ్బులు సంపాదిస్తుంది. ఒక రాజకీయ నేత తన కొడుకుని పాలిటిక్స్‌లోకి తీసుకురావాలని చూస్తున్న సమయంలో ఒక రహస్యం నా దగ్గర ఉందని ఆస్ట్రేలియా నుంచి ఒకరు భయపెడతారు. అది బయటకు వస్తే రాజకీయ జీవితం ఉండదు అని ఆ రహస్యాన్ని వెతికి తెచ్చేందుకు ఒక క్రిమినల్‌ని హైర్ చేస్తారు. ఓ రోజు హీరోయిన్ తన అసైన్‌మెంట్ డబ్బులు తీసుకోవడానికి ఓ వ్యక్తి రూమ్‌కి వెళ్తుంది. అనుకోకుండా ఆ క్రిమినల్ రూమ్‌లోకి వెళ్లడంతో అక్కడ కొన్ని వస్తువులను దొంగిలిస్తుంది. ఆ వస్తువుల్లో ఆ సీక్రెట్ కూడా ఉంటుంది. అలాగే ఆమెకు దొంగ డబ్బు గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంతో ఆ కిల్లర్, రాజకీయ నాయకుల మనుషులు, ఇంకొంతమంది ఆ అమ్మాయి వెనక పడతారు. అనుకోకుండా ఆమె ఓ స్కామ్ కేసులో ఇరుక్కుంటుంది. మరి వీటన్నిటి నుంచి హీరోయిన్ ఎలా బయటకు వచ్చింది? హీరో – హీరోయిన్ ప్రేమ కథ ఏమైంది? ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటి? ఆ డబ్బు, స్కామ్ ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. సినిమా అంతా ఆస్ట్రేలియాలోని షూట్ చేసారు. అక్కడ ఉన్నవాళ్లతోనే తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కథతో మొదలుపెట్టి ప్రేమకథతో నడుస్తుంది. ఓ స్కామ్ లో హీరోయిన్ ఎలా చిక్కుకుంది అని సస్పెన్స్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ ఆ సీక్రెట్ ఏంటి? డబ్బు ఏంటి? ఆ స్కామ్ ఏంటి? అందులో హీరో, హీరోయిన్ ఎలా ఇరుక్కున్నారు, ఎలా బయటకు వచ్చారు అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ లు బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ లా నడిపించాడు. అక్కడక్కడా కాస్త కామెడీ వర్కౌట్ చేసారు. అక్కడక్కడా రొమాన్స్ కూడా ఎక్కువే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :