Thursday, 12 March 2026 03:49:11 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Baghira: కేజీఎఫ్‌ నిర్మాత అందిస్తున్న మరో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బఘీర'

Date : 15 October 2024 05:10 PM Views : 304

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కేజీఎఫ్‌, సలార్‌ లాంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలింస్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన మరో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'బఘీర', ఉగ్రమ్‌ ఫేమ్‌ శ్రీమురళి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథ అందించడం విశేషం. డాక్టర్‌ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లిరికల్ సాంగ్‌ రుధిర హరను ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం థ్రిలింగ్‌ యాక్షన్‌ ఏపిసోడ్స్‌తో, ఆకట్టుకునే విజువల్స్‌తో వుండబోతుందని, హీరో శ్రీమురళి పాత్ర ప్రేక్షకులను సరికొత్త అనుభూతికి గురిచేసే విధంగా ఉంటుందని అంటున్నారు నిర్మాత. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఏపియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పీ తెలుగులో విడుదల చేస్తుంది. రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎజె శెట్టి డీవోపీ కాగా, కాంతార ఫేమ్‌ బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :