Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ప్రముఖ నటుడు కమలహాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన పేరుకు ముందు స్టార్ ట్యాగ్స్ తగిలించవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కమల్‌ను ఆయన అభిమానులు ‘ఉలగనాయగన్’, ‘ఆండవర్’ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే, ఇకపై తన పేరుకు ముందు ఎలాంటి ట్యాగులు తగిలించవద్దని, కమల్ లేదంటే కమల హాసన్ అని మాత్రమే పిలవాలని అభిమానులు, మీడియా, సినీ పరిశ్రమ, క్యాడర్‌కు విజ్ఞప్తి చేస్తూ ఎక్స్‌లో నోట్ విడుదల చేశాడు. గతంలో నటుడు అజిత్ కుమార్ కూడా ఇలాంటి విన్నపమే చేశాడు. తన పేరకు ముందు ‘తలా’ అని కానీ, మరే స్టార్ ట్యాగ్ తగిలించవద్దని కోరాడు. అజిత్, అజిత్ కుమార్, లేదంటే ఏకే అని మాత్రమే సంబోధించాలని విజ్ఞప్తి చేశాడు.
Also Read : టీమిండియాతో పాంటింగ్‌కు ఏం పని?: గౌతమ్ గంభీర్ దీటుగా కౌంటర్
Admin
Studio18 News