Wednesday, 17 December 2025 03:00:21 PM
# Shaheen Afridi: బిగ్ బాష్ లీగ్ లో పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదికి అవమానం... వీడియో ఇదిగో! # SP Balu: నా తండ్రి రాజకీయాలకు అతీతంగా ఉండేవారు.. ఆయనకు అందరూ ఒకటే: ఎస్పీ బాలు కొడుకు # Kavitha: 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం: కవిత # IPL 2026: రేపే ఐపీఎల్-2026 ఆటగాళ్ల వేలం... అబుదాబిలో సర్వం సిద్ధం # Indian Army: చైనా పార్టులు వద్దు.. రూ.5,000 కోట్లతో స్వదేశీ డ్రోన్ల కొనుగోలుకు ఆర్మీ సిద్ధం # BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్.. రూ. 997 రీఛార్జ్‌తో 150 రోజుల వ్యాలిడిటీ! # Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ!

Jhoney Master: జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్.. అవకాశాల కోసం తనే నా భర్తను ట్రాప్ చేసిందన్న జానీ భార్య

Date : 28 September 2024 11:43 AM Views : 403

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : ‘నా భర్తను ట్రాప్ చేసి, ఇంటికి కూడా రాకుండా చేసింది.. ఐదేళ్ల పాటు నాకు నరకం చూపించింది. చివరకు నేను ఆత్మహత్యాయత్నం చేసేంత వరకూ తీసుకెళ్లింది’ అంటూ జానీ మాస్టర్ బాధితురాలిపై ఆయన భార్య సుమలత సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ బాధితురాలిపై తాజాగా ఫిలిం ఛాంబర్ లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలిపై మండిపడింది. కొరియోగ్రాఫర్ గా అవకాశాల కోసం బాధితురాలే తన భర్త జానీ మాస్టర్ ను ట్రాప్ చేసిందని చెప్పింది. జానీని ఇంటికి రానివ్వలేదని, పెళ్లి చేసుకోవాలని నిత్యం వేధించేదని ఆరోపించింది. ‘నా భర్త ఇంటికి సరిగా రాకపోవడంతో నేనే బాధితురాలి ఇంటికి వెళ్లాను. జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే నేనే తప్పుకుంటా. ఆయన జీవితంలో నుంచి వెళ్లిపోతానని చెప్పా. అయితే, బాధితురాలు మాత్రం జానీ తనకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పడంతో నమ్మేశా’ అని సుమలత తెలిపింది. వాస్తవానికి ఇక్కడ బాధితురాలు ఆ అమ్మాయి కాదు తామేనని జానీ మాస్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఆ అమ్మాయికి తన భర్తతో పాటు చాలామందితో సంబంధం ఉందని సుమలత చెప్పింది. ఈ విషయం తెలిసి తన భర్త ఆమెను దూరం పెట్టాడని వివరించింది. దీంతో తప్పుడు కేసు పెట్టి తన భర్తపై కక్ష సాధిస్తోందని సుమలత ఆరోపించింది. ఆ అమ్మాయితో పాటు వాళ్ల అమ్మ కూడా తమను వేధించారని, తప్పుడు కేసు పెట్టిన ఆ తల్లీకూతుళ్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తనకు, తన పిల్లలకు ఏం జరిగినా వారిదే బాధ్యత అని, తమకు న్యాయం చేయాలని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు సుమలత ఫిర్యాదు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :