Sunday, 08 March 2026 09:45:02 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Guns And Roses | ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్న గ‌న్స్ అండ్ రోజెస్ పాట‌.. మాస్ ఆడియ‌న్స్ ఫుల్ ఫిదా

Guns And Roses | పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల షూటింగ్ మొత్తం

Date : 15 September 2025 08:12 PM Views : 467

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Guns And Roses | పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ‘ఫైర్ స్టార్మ్’ సాంగ్ పవర్ ఫుల్ రెస్పాన్స్ రాబట్టగా, ‘సువ్వి సువ్వి’ పాట కూడా అల‌రించింది. ఇక మూవీ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మూవీపై హైప్ పెంచే పనిలో పడిపోయారు. సినిమా ట్రైలర్ పై డైరెక్టర్ సుజీత్ పూర్తిగా ఫోకస్ పెట్టారని సినీ వర్గాల టాక్.. సెప్టెంబ‌ర్ 18న ట్రైల‌ర్ విడుదల చేస్తార‌ని టాక్.ఇక ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుండి గ‌న్స్ అండ్ ఫైర్ అంటూ సాగే పాట విడుద‌ల చేశారు. ఈ పాట ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తుంది. ఈ పాట మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

ఇక మ‌రి కొద్ది రోజులలో విడుద‌ల కానున్న ట్రైల‌ర్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, తమన్ ఇచ్చిన పవర్ ఫుల్ బీజీఎం రికార్డులు చెరిపేస్తాయ‌ని అంటున్నారు. ఇక సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి, 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అమెరికాలో ఇప్పటికే OG అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా, టికెట్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌కి ఉన్న పాన్-ఇండియా ఫాలోయింగ్ సినిమాకి క్రేజును రెట్టింపు చేస్తోంది. రిలీజింగ్ డే రోజున భారీ ఓపెనింగ్స్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమాలో, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, హరిష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన మాస్ మ్యూజిక్‌తో రెచ్చిపోనున్నాడు.గ‌త కొద్ది రోజులుగా ఓజీకి సంబంధించిన పోస్ట‌ర్స్ కూడా నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇవి ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :