Saturday, 07 March 2026 09:12:52 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Rajasaab | ప్రభాస్‌తో నాటు నాటు డ్యాన్సర్‌ ప్రేమ్‌ రక్షిత్.. రాజాసాబ్‌పై మారుతి అదిరిపోయే అప్‌డేట్‌

Rajasaab | మారుతి ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్‌ గ్లింప్స్‌లో ప్రభాస్‌ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చ

Date : 17 September 2025 07:43 PM Views : 300

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Rajasaab | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వన్‌ ఆఫ్‌ ది మోస్ట్ టాలెంటెడ్‌ కొరియోగ్రఫర్లలో ఒకడు ప్రేమ్‌ రక్షిత్‌. ఈ స్టార్ డ్యాన్సర్‌ కంపోజ్‌ చేసిన నాటు నాటు పాట ఏకంగా గ్లోబల్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కాగా ఇప్పుడు ప్రేమ్‌ రక్షిత్‌కు సంబంధించిన ఆసక్తికర ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. ప్రభాస్‌, మారుతి కాంబోలో వస్తున్న ప్రాజెక్టు రాజాసాబ్‌. ఈ మూవీలో ప్రభాస్‌లో అదిరిపోయే స్టెప్పులేయించబోతున్నాడట ప్రేమ్‌ రక్షిత్‌. ఇటీవలే ఎక్స్‌లో అభిమానులతో చేసిన చిట్‌చాట్‌లో రాజాసాబ్‌ ఫస్ట్ సింగిల్‌ గురించి షేర్ చేశాడు మారుతి. ప్రభాస్‌ గొప్ప డ్యాన్సర్‌గా పరిగణించబడడు. అతని ఫిల్మోగ్రఫీని చూస్తే పాటల్లో డ్యాన్సులు వైరల్ కావు. లక్షలాది మంది అభిమానుల్లాగే నేను కూడా ప్రభాస్‌ను అతని (ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌) స్టైల్‌లో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నాను. నాపై ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఊహించుకోండి. పనికట్టుకుని ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌తో కలిసి వర్క్‌ చేయాలనుకున్నా. ప్రేమ్‌ రక్షిత్‌చాలా బిజీగా ఉన్నాడు. అయినా కానీ అతడిని రాజాసాబ్‌ టీంలోకి తీసుకున్నా. అభిమానులు ఈ కాంబోలో తప్పకుండా ఆస్వాదిస్తారు.. అంటూ చెప్పుకొచ్చాడు మారుతి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట హల్ చల్ చేయడమే కాదు రాజాసాబ్‌పై హైప్‌ పెంచేస్తున్నాయి. మేకర్స్‌ ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్‌ గ్లింప్స్‌లో ప్రభాస్‌ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ.. పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్‌ ట్రీట్ ఇవ్వడం పక్కా అని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌తో టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :