Sunday, 08 March 2026 03:59:33 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Suhas : మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని తన సినిమాని పట్టించుకోని సుహాస్.. ఏం జరిగింది..?

Date : 17 September 2024 02:37 PM Views : 249

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : Suhas : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారాడు. కలర్ ఫోటోతో మెప్పించిన సుహాస్ ఆ తర్వాత హీరోగా వరుస సక్సెస్ లు కొడుతున్నాడు. సుహాస్ హీరోగా ఇప్పటివరకు రిలీజయిన నాలుగు సినిమాలు ప్రేక్షకులని మెప్పించి హిట్ అయ్యాయి. అయితే సుహాస్ ఈ మధ్య కొన్ని సినిమాలని ప్రమోట్ చెయ్యట్లేదు. ఇటీవల సుహాస్ ముఖ్య పాత్రలో నటించిన ఓ ఆంథాలజీ జానర్ సినిమా శ్రీరంగ నీతులు ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. ఇప్పుడు సుహాస్ మెయిన్ లీడ్ చేసిన గొర్రె పురాణం సినిమాని పట్టించుకోవట్లేదు. గొర్రె పురాణం సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ కి మూడు రోజులే ఉన్నా ఇప్పటి వరకు సుహాస్ గొర్రె పురాణం సినిమా గురించి ఒక్క ట్వీట్ కానీ, పోస్ట్ కానీ పెట్టలేదు. ఆ సినిమా ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు. గతంలో ఆ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు, పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం షేర్ చేసిన సుహాస్ ఇప్పుడు ఆ సినిమాని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అతని ఫ్యాన్స్, టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. సినిమా సరిగ్గా రాలేదా? లేక రెమ్యునరేషన్ విషయంలో ఏమైనా అభిప్రాయ బేధాలు వచ్చాయా? మూవీ టీమ్ తో ఏదైనా గొడవ అయిందా? లేక సినిమాలో సుహాస్ హీరోనా కాదా? అని టాలీవుడ్ లోను, ఫ్యాన్స్ లోను చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అయితే సుహాస్ మెయిన్ హీరోగా చేసిన సినిమాలనే ప్రమోట్ చేస్తున్నాడు. ఇవన్నీ స్టార్ అవ్వకముందు ఒప్పుకున్న సినిమాలు, అందుకే ప్రమోట్ చెయ్యట్లేదు అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి సుహాస్ ఈ గొర్రె పురాణం సినిమాని ఎందుకు పట్టించుకోవట్లేదో అతనికి, సినిమా టీమ్ కే తెలియాలి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :