Sunday, 15 March 2026 10:51:46 AM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

Deepika Padukone: కూతురి కోసం కేక్ చేసిన దీపిక... ఆడంబరాలకు దూరంగా బర్త్‌డే వేడుక!

Date : 10 September 2025 06:30 PM Views : 292

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : కుమార్తె 'దువా' మొదటి పుట్టినరోజు వేడుకలు స్వయంగా చాక్లెట్ కేక్ తయారు చేసిన తల్లి దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోతో ఎమోషనల్ పోస్ట్ షేర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన కుమార్తె 'దువా' మొదటి పుట్టినరోజును ఎంతో ప్రత్యేకంగా, నిరాడంబరంగా జరిపారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లల పుట్టినరోజులను గ్రాండ్‌ పార్టీలతో అట్టహాసంగా జరుపుకుంటారు. కానీ, దీపిక మాత్రం అందుకు భిన్నంగా తన ప్రేమను చాటుకున్నారు. తన గారాలపట్టి కోసం స్వయంగా కేక్ తయారు చేసి అందరి మనసులు గెలుచుకున్నారు. బాలీవుడ్ స్టార్ జంట రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణెలకు గతేడాది సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. తమ ప్రార్థనలకు దక్కిన సమాధానంలా భావించి పాపకు 'దువా' అని పేరు పెట్టారు. తాజాగా సెప్టెంబర్ 9న దువా మొదటి పుట్టినరోజు సందర్భంగా దీపిక స్వయంగా ఒక చాక్లెట్ కేక్ తయారు చేశారు. ఆ కేక్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ... "నా ప్రేమ భాష ఏంటో తెలుసా? నా కుమార్తె మొదటి పుట్టినరోజు కోసం కేక్ చేయడమే" అని ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కేవలం రెండు గంటల్లోనే 5 లక్షలకు పైగా లైకులు సాధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. నటీమణులు బిపాషా బసు, కాజల్ అగర్వాల్, భూమి పడ్నేకర్ వంటి వారు దువాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు సైతం "స్వీట్ తల్లి నుంచి స్వీట్ బేబీకి స్వీట్ కేక్", "మీరే స్వయంగా కేక్ చేశారా, గ్రేట్!", "మీరు బెస్ట్ మమ్మీ" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆడంబరాలకు పోకుండా, ఎంతో సింపుల్‌గా తన ప్రేమను చాటుకున్న దీపిక తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :