Sunday, 15 March 2026 02:18:50 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

JioHotstar: ఐసీసీకి జియోహాట్‌స్టార్ భారీ షాక్..!

Date : 08 December 2025 06:01 PM Views : 140

Studio18 News - క్రీడలు / : ఐసీసీ ఒప్పందం నుంచి వైదొలగిన జియోహాట్‌స్టార్! 2026 టీ20 ప్రపంచకప్ ప్రసార బాధ్యతల నుంచి తప్పుకున్న వైనం భారీ ఆర్థిక నష్టాలే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడి వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీకి ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా ఉన్న 'జియోహాట్‌స్టార్' తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. భారీ ఆర్థిక నష్టాల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. అయితే, అంతకుముందే జియోహాట్‌స్టార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం ఈ టోర్నీకి మాత్రమే కాకుండా, 2024-27 మధ్య కాలానికి కుదుర్చుకున్న 3 బిలియన్ డాలర్ల మీడియా హక్కుల ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జియోహాట్‌స్టార్ నిర్ణయంతో అప్రమత్తమైన ఐసీసీ, వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. 2026-29 కాలానికి గాను 2.4 బిలియన్ డాలర్లతో కొత్తగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను ప్రారంభించింది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలను ఐసీసీ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే, ఒప్పందం విలువ చాలా ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదని సమాచారం. దీంతో 2026 టీ20 ప్రపంచకప్ ప్రసార హక్కులపై ప్రస్తుతం గందరగోళం నెలకొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :