Studio18 News - క్రీడలు / : sixes ban : క్రికెట్ ఆట గత కొన్నాళ్లలో ఎంతగానో మారిపోయింది. ఒకప్పుడు సిక్స్‌లు కొట్టడం అనేది అరుదైన విషయం. అయితే.. ప్రస్తుత కాలంలో ఏ ఫార్మాట్‌లోనైనా సరే బ్యాటర్లు అవలీలగా సిక్సర్లు బాదుతున్నారు. క్రికెటర్లు సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే అభిమానులు ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల ఓ కొత్త రూల్‌ను తీసుకువచ్చారు. సిక్స్ కొడితే సదరు బ్యాటర్ ఔటైనట్లే. ఈ రూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లో అయితే తీసుకురాలేదు గానీ.. యూకేలోని సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ మాత్రం తీసుకువచ్చింది. సదరు స్టేడియంలో సిక్స్ కొడితే మాత్రం బ్యాటర్ ఎంచక్కా పెవిలియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ స్టేడియం చుట్టు పక్కల నివసించే వారి వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. బ్యాటర్లు కొట్టే సిక్సుల వల్ల ఆ స్టేడియం సమీపంలో నివసించే వారికి ఆక్తి నష్టం వాటిల్లుతోంది. అంతేకాదండోయ్ పలువురికి గాయాలు కూడా అవుతున్నాయి. గ్రౌండ్ చిన్నదిగా ఉండడంతో బ్యాటర్లు కొట్టే సిక్సర్ల వల్ల సమీపంలోని ఇళ్లు కిటీకీలు, రోడ్డు పక్కకు పార్కు చేసిన కార్లు డ్యామేజీ అవుతున్నాయి.రోజు రోజు స్థానికుల నుంచి ఫిర్యాదులు ఎక్కువ అవుతుండడంతో సౌత్‌విక్ అండ్ షోర్‌హామ్ క్రికెట్ క్లబ్ సిక్స్‌పై నిషేదం విధించింది. కాగా.. బ్యాటర్ మొదటి సిక్స్ కొట్టినప్పుడు ఆ పరుగులను పరిగణలోకి తీసుకోరు. రెండోసారి సిక్స్ కొడితే మాత్రం సదరు ఆటగాడు ఔటైనట్లుగా అంపైర్లు ప్రకటిస్తారు. దీనిపై సదరు క్లబ్ కోశాధికారి మార్క్ బ్రోకప్స్ మాట్లాడాడు. గతంలో క్రికెట్ ఎంతో ప్రశాంతంగా ఉండేది. వన్డేలు, టీ20ల రాకతో ఆటగాళ్లలో దూకుడు పెరిగింది. దీంతో స్టేడియం సమీపంలో ఉండే వారికి ఇబ్బందులు ఎదురుఅవుతున్నాయి. అందుకనే సిక్స్‌లను నిషేదించినట్లుగా చెప్పారు.
Admin
Studio18 News