Studio18 News - క్రీడలు / : Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. అతడి ప్రతిభపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు అతడిని ఆకాశానికి ఎత్తుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని ఘనంగా సత్కరించేందుకు సిద్ధమైంది. పలు రూపాల్లో నదీమ్ కు 150 మిలియన్ పాకిస్థాన్ రూపాయల (రూ.4.5కోట్లు) కంటే ఎక్కువ మొత్తం అందుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, అతని మామ బర్లీ జావెలిన్ త్రోయర్ కు అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అర్షద్ నదీమ్ మామ ముహమ్మద్ నవాజ్. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన చిన్న కుమార్తె అయోషాకు నదీమ్ తో వివాదం జరిపించాడు. ఇప్పుడు వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల క్రితం మా కూతురికి నదీమ్ తో పెళ్లి చేయాలని నిర్ణయించినప్పుడు అతను చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు. అయితే, తనకు క్రీడల పట్ల విపరీతమైన మక్కువతో ఇంట్లోనూ, పొలాల్లోనూ నిరంతరం జావెలిన్ ను ప్రాక్టీస్ చేసేవాడని నవాజ్ చెప్పాడు. అయితే, నదీమ్ కు తన మామ ముహమ్మద్ నవాజ్ ఓ గేదెను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతంలో పెంపకం, సంప్రదాయానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంపై నవాజ్ మాట్లాడుతూ.. గేదెను బహుమతిగా ఇవ్వడం తమ గ్రామంలో చాలా విలువైనది, గౌరవనీయమైంది అని నవాజ్ చెప్పుకొచ్చాడు. నదీమ్ కు తన మామ ఇవ్వాలనుకుంటున్న బహుమతిపై ఏమిటో తెలుసుకొని ప్రతిఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Admin
Studio18 News