Monday, 16 March 2026 01:53:16 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Hardik Pandya: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక... పాండ్యాకు రెస్ట్

Date : 03 January 2026 06:13 PM Views : 117

Studio18 News - క్రీడలు / : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి పనిభారం కారణంగా సిరీస్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా జనవరి 11 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో స్థానం నిలుపుకున్నారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అయితే, ఈ సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ ఆడేది, లేనిది ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు లభించింది. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లను ఎంపిక చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినిచ్చారు. అతను ఒక మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు ఇంకా సిద్ధంగా లేడని, రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని పనిభారాన్ని (వర్క్‌లోడ్) పర్యవేక్షిస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జనవరి 11న వడోదరలో జరిగే తొలి వన్డేతో ప్రారంభమవుతుంది. రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో, చివరిదైన మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగుతుంది. భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :