Tuesday, 10 March 2026 04:12:22 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకం.. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ

Date : 07 January 2026 06:42 PM Views : 96

Studio18 News - క్రీడలు / : మూడో వన్డేలో చెలరేగిన భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ కేవలం 63 బంతుల్లోనే శతకంతో విధ్వంసం గత మ్యాచ్‌లోనూ 24 బంతుల్లో 68 పరుగులు చేసిన వైభవ్ ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన యంగ్ ఇండియా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడుతున్న మూడో, చివరి వన్డేలోనూ దుమ్మురేపుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వైభవ్ కేవలం 63 బంతుల్లోనే విధ్వంసక శతకం బాదాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టిన వైభవ్.. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తంగా 127 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ కూడా రాణిస్తుండటంతో భారత్ వికెట్ నష్టపోకుండా పటిష్ఠ‌ స్థితిలో ఉంది. గత మ్యాచ్‌లోనూ వైభవ్ ఇదే తరహాలో చెలరేగిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా కుదించిన ఆ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 24 బంతుల్లో 10 సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో బౌలర్లు కూడా రాణించారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కిషన్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా, దక్షిణాఫ్రికా తరఫున జాసన్ రౌల్స్ (114) సెంచరీతో పోరాడాడు. ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. మూడో మ్యాచ్‌లోనూ సెంచరీతో చెలరేగి, 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే దిశగా జట్టును నడిపిస్తున్నాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :