Monday, 16 March 2026 01:54:50 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

Sunil Gavaskar | క్రికెట్ దిగ్గజానికి ‘ఆన్‌లైన్‌ భద్రత’.. భారత తొలి క్రీడాకారుడిగా గవాస్కర్..!

Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) పోరాటం ఫలించింది. ఆన్‌లైన్‌లో కొందరు తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్

Date : 23 December 2025 06:23 PM Views : 108

Studio18 News - క్రీడలు / : Sunil Gavaskar : భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ (Sunil Gavaskar) పోరాటం ఫలించింది. ఆన్‌లైన్‌లో కొందరు తన పేరును, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన లెజెండరీ ఆటగాడికి రక్షణ లభించింది. గవాస్కర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా పెట్టిన పోస్టులను వెంటనే తొలగించాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తీర్పునిచ్చింది. ఇకపై ఈ మాజీ క్రికెటర్ పేరును, ఫొటోలను, వీడియోలను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని సహించబోమని కోర్టు స్పష్టం చేసింది. దాంతో.. కోర్టు నుంచి ఆన్‌లైన్ భద్రత పొందిన మొట్టమొదటి భారత క్రీడాకారుడిగా గవాస్కర్ గుర్తింపు సాధించాడు. నిత్యం క్రీడా విశ్లేషణలతో వార్తల్లో నిలిచే గవాస్కర్ ఈమధ్య టీమిండియా వైఫల్యానికి హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)ను నిందిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. అలానే కొందరు ఆటగాళ్ల ప్రదర్శనను ఎండగట్టాడు కూడా. అయితే.. గౌతీపై, కొందరు ఆటగాళ్లపై అతడు చేయని కొన్ని కామెంట్లను అతడికి ఆపాదిస్తూ కొందరు ఎక్స్, మెటా, గూగుల్‌లో పోస్ట్‌లు పెట్టారు.

దాంతో.. తన ఫొటోలను, వీడియోలను దుర్వినియోగం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదును విచారించిన జస్టిస్ హన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా (Justice Manmeet Pritam Singh Arora) బెంచ్ సదరు యూఆర్‌ఎల్స్‌ (URL) వివరాలను రెండు రోజుల్లో కోర్టుకు సమర్పించాలని సూచించింది. బెంచ్ ఆదేశాల మేరుకు గవాస్కర్ తన పేరును దుర్వినియోగం చేస్తున్న యూఆర్‌ఎల్స్‌ వివరాలను తెలియజేశాడు. మంగళవారం గవాస్కర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ జైన్ వాదనలు వినిపించారు. ఆయన సమర్పించిన యూఆర్‌ఎల్స్‌ను పరిశీలించిన ధర్మాసనం.. సోషల్ మీడియా, ఈ కామర్స్ సంస్థల వైబ్‌సైట్ల నుంచి సదరు పోస్ట్‌లను 72 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఏ సంస్థ అయినా గవాస్కర్ ఫొటోలు, వీడియోలను ఉపయోగిస్తుంటే కోర్టు ధిక్కరణ కేసు పెడుతామని హెచ్చరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :