Studio18 News - క్రీడలు / : Chris Gayle : వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్ (Chris Gayle) ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ సంచలనం. అతడు క్రీజులోకి వచ్చాడంటే బౌలర్లు వణికిపోయేవాళ్లు. దంచడమే డ్యూటీగా భావించే ఈ డాషింగ్ బ్యాటర్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. క్రికెటర్‌గా తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన గేల్.. ఈమధ్య తన ప్రత్యేక వేషధారణతో వైరలవుతున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ కరీబియన్ వీరుడు డ్రాగన్ వేషంలో.. కార్నివాల్ డాన్స్ వీడియోతో మరోసారి నెట్టింటిని షేక్ చేస్తున్నాడు. ఆల్‌టైమ్ దిగ్గజ ఓపెనర్లలో ఒకడైన క్రిస్ గేల్ కొత్త ఏడాది సందర్బంగా తమ ప్రాంత విశిష్టతను ప్రపంచానికి చాటాడు. డ్రాగన్ వేషధారణతో హుషారుగా డాన్స్ చేస్తూ మురిసిపోయాడీ యూనివర్సల్ బాస్. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫుక్రి గ్వాన్ 2026’ పేరుతో షేర్ చేసిన వీడియోలో కరీబియన్ మూలాలతో గిల్ కనిపించాడు. ఈ పదానికి ‘ఏం జరుగుతోంది?’ అని అర్థం. పక్షి రెక్కలను పోలిన డ్రాగన్ బొమ్మలను ధరించిన గిల్.. చేతిలో పొడవాటి కర్రతో చిందులు వేశాడు. మైదానంలో తన డేరింగ్ ఆటకు కేరాఫ్ అయిన ఈ మాజీ ఓపెనర్.. ఇప్పుడు సంప్రదాయ లుక్‌లో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాడు.
Admin
Studio18 News