Tuesday, 10 March 2026 04:12:17 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

MCG: ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. బాక్సింగ్ డే టెస్టుకు పోటెత్తిన అభిమానులు.. బద్దలైన పాత రికార్డులు

Date : 26 December 2025 08:19 PM Views : 186

Studio18 News - క్రీడలు / : బాక్సింగ్ డే టెస్టుకు రికార్డు స్థాయిలో హాజరైన ప్రేక్షకులు ఒకే రోజు 94,199 మంది హాజరుతో ఎంసీజీలో సరికొత్త రికార్డు 2015 ప్రపంచకప్ ఫైనల్ రికార్డును అధిగమించిన హాజరు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు తరలివచ్చారు. దీంతో ఈ మైదానంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదైంది. గతంలో 2015 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. ఇప్పటివరకు అదే అత్యధికం కాగా, తాజా మ్యాచ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒకే రోజు అత్యధిక ప్రేక్షకులు హాజరైన రికార్డు కూడా నమోదైంది. 2013లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజుకు 91,112 మంది హాజరు కాగా, ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో తొలి రోజుతో పాటు రెండు, మూడు రోజుల టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో 2013లో నమోదైన యాషెస్ సిరీస్ మొత్తం హాజరు రికార్డు (2,71,865) కూడా ఈసారి బద్దలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో కీలక ప్రకటన చేసింది. మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌కు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2027 మార్చిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య చారిత్రక డే-నైట్ టెస్టును ఎంసీజీలో నిర్వహించనుంది. ఎంసీజీలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఆడనున్న తొలి పింక్ బాల్ టెస్ట్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు భారీ స్పందన వస్తుందని అంచనా వేస్తున్న సీఏ, తమ చరిత్రలోనే తొలిసారిగా టికెట్ బ్యాలెట్‌ను ప్రారంభించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :