Studio18 News - క్రీడలు / : రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు టీ20 సిరీస్ పై దృష్టి సారించింది. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లలో దాదాపు అందరికి విశ్రాంతి ఇచ్చారు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ఇప్పటికే రెండు జట్లు తొలి టీ20కి వేదికైన గ్వాలియర్‌కు చేరుకున్నాయి. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. టెస్టులకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్‌లో ఆడేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ క్రమంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే.. హార్దిక్ బౌలింగ్ తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సంతోషంగా లేడని తెలుస్తోంది. తన బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం.. హార్దిక్ స్టంప్‌లకు చాలా దగ్గరగా బౌలింగ్ చేస్తున్నాడు. దీనిపై మోర్కెల్ అసంతృప్తిగా ఉన్నాడు. దీంతో హార్దిక్ పాండ్యాతో కాసేపు మోర్కెల్ చర్చించినట్లు పేర్కొంది. ఇక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్‌లు మోర్కెల్ ఆధ్వర్యంలో తీవ్రంగా శ్రమించారు. బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.
Admin
Studio18 News