Studio18 News - క్రీడలు / : Paris Olympics 2024 – Nikhat Zareen : పారిస్ ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగింది స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్. అయితే.. ఆమె జర్నీ ప్రిక్వార్టర్స్‌తోనే ముగిసింది. మహిళల 50 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో చైనా బాక్సర్ వు హు చేతిలో ఓటమి పాలైంది. గురువారం టాప్ సీడ్ చైనా బాక్సర్ వు హు 5-0 తేడాతో నిఖత్ జరీన్ పై విజయం సాధించింది. దీంతో నిఖత్ పతక ఆశలు ఆవిరి అయిపోయాయి. ఇక బాక్సింగ్‌లో పతక ఆశలు లవ్లీనా, నిశాంత్‌పైనే ఉన్నాయి. తెలంగాణ బిడ్డ అయిన నిఖత్ పై ప్రత్యర్థి ఆది నుంచే పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో తొలి రౌండ్‌ను నిఖత్ 49-46తో చేజార్చుకుంది. ఇక రెండో రౌండ్‌లో నిఖత్ కాస్త ప్రతిఘటించింది. అయితే.. ఆఖరకు 48-47 తేడాతో కోల్పోయింది. ఇక ఆఖరి రౌండ్‌లో చైనా బాక్సర్ విజృంభించింది. పంచులతో నిఖత్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిఖత్ రక్షణాత్మక ధోరణి కనబరచడంతో 45-50తో ఓడిపోయింది. ఇక బాక్సింగ్‌లో పతక ఆశలు లోవ్లీనా, నిశాంత్ ల పైనే ఉన్నాయి. వీరిద్దరు క్వార్టర్ పైనల్‌కు చేరుకున్నారు. ఆగస్టు 4న వీరి మ్యాచులు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరాయి. గురువారం పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా రికార్డులకు ఎక్కాడు.
Admin
Studio18 News