Sunday, 08 September 2024 06:10:28 AM
# Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతులు విజయవంతం # Kubera Movie: వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్ # Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ # Chiranjeevi: చిరంజీవి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు # Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు # Yasir Arafat: పాక్ క్రికెట్ బోర్డు ఓ స‌ర్క‌స్‌.. అందులో అంద‌రూ జోక‌ర్లే: యాసిర్ అరాఫ‌త్‌ # CM Revanth Reddy: కీలక వ్యక్తికి విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ # irrigation officials: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు # Pervez Musharraf: భార‌త్‌లో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.38 కోట్ల‌కు వేలం! # Brij Bhushan: నాటి కుట్ర నేడు బట్టబయలైంది.. వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ # Dharshan: అశ్లీల సందేశాలతో మొదలై... హత్యకు గురయ్యే దాకా...! రేణుకా స్వామి హత్యలో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు # Babar Azam: బాబర్ ఆజామ్‌కు షాక్‌.. పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌​ ఎవరంటే? # T20 Blast 2024: బౌలర్‌తో సంబంధం లేని.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన నోబాల్.. # Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు # TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని ప‌నులు చేయ‌కండి.. సజ్జనార్ ఫైర్‌! # Military School: మిలటరీ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల # Chandrababu: సీఎం చంద్ర‌బాబు క‌లిసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ # Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు # Chandrababu: విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు # CV Anand: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Mohammad Shami: పేసర్ మహ్మద్ షమీ డైట్‌ సీక్రెట్ బయటపెట్టిన అతడి స్నేహితుడు

Date : 26 July 2024 05:56 PM Views : 42

Studio18 News - క్రీడలు / : మడమ గాయానికి శస్త్రచికిత్స అనంతరం కోలుకొని.. తిరిగి భారత్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా సన్నాహాలు మొదలు పెట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ అనుసరించే ఆహారపు అలవాట్లపై (డైట్) అతడి స్నేహితుడు ఉమేష్ కుమార్ స్పందించాడు. మటన్‌ అంటే షమీకి అమితమైన ఇష్టమని, షమీ దేన్నైనా భరించగలడు, కానీ మటన్ లేకుండా ఉండలేడని ఉమేష్ కుమార్ వెల్లడించాడు. మటన్ లేకుండా ఒక్క రోజు మాత్రమే ఉండగలడని, రెండవ రోజు కూడా మటన్ లేకుంటే ఇబ్బందిగా భావిస్తాడని, ఇక మూడవ రోజు కూడా మటన్ తినకపోతే పిచ్చివాడిలా చేస్తాడని అన్నాడు. షమీ రోజుకు 1 కేజీ మటన్ తింటాడని, ప్రతిరోజూ మటన్ తినకుంటే అతడి బౌలింగ్ వేగం గంటకు 15 కిమీ మేర తగ్గుతుందని ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుభంకర్ మిశ్రా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా మహ్మద్ షమీ గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే చీలమండ గాయంతో బాధపడుతున్న షమీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన షమీ.. ఆ తర్వాత ఐపీఎల్, టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు దూరమైన విషయం తెలిసిందే. కాగా షమీ ఇటీవలే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ సమయానికి షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని భారత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :