Thursday, 12 March 2026 01:33:18 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

Date : 07 February 2026 06:53 PM Views : 116

Studio18 News - అంతర్జాతీయం / : గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకువస్తుందని వెల్లడి యుద్ధానికి తెరదించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని అమెరికా హామీ ఇచ్చిందని వెల్లడి యుద్ధం ముగింపునకు కచ్చితమైన షెడ్యూల్ కావాలని అమెరికా అడిగిందన్న జెలెన్‌స్కీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా జరుగుతోన్న యుద్ధం ముగింపునకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉక్రెయిన్, రష్యా దేశాలకు జూన్ నెలాఖరు వరకు అమెరికా గడువు ఇచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా విధించిన గడువులోగా లక్ష్యం నెరవేరకపోతే దానిని సాధించేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరుపక్షాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. "ఈ వేసవి ప్రారంభం నాటికి యుద్ధాన్ని ముగించాలని అమెరికన్లు సూచించారు. జూన్ నాటికి అన్ని వ్యవహారాలను కొలిక్కి తీసుకురావాలని చెప్పారు. యుద్ధానికి తెరదించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కచ్చితమైన షెడ్యూల్ కావాలని అమెరికన్లు అడిగారు. దీని ప్రకారం వారు ఇరు దేశాలపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది" అని జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య దాదాపు నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతోంది. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు ఇప్పటికే రెండుసార్లు చర్చలు జరిపారు. అబుదాబీ వేదికగా జరిగిన రెండో విడత చర్చల్లో అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మూడో విడత చర్చలు అమెరికాలో నిర్వహించేందుకు ట్రంప్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :