Studio18 News - భక్తి / : తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టెకెన్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,939 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,668గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.50 కోట్లు వచ్చింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. తోమాల, అర్జన సేవల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు గవర్నర్. ఆయనకు వేదాశీర్వచనం చేసి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు శాంతిహోమం నిర్వహించనున్నారు. సర్వదోష నివారణార్థం ప్రభుత్వ ఆదేశాలతో హోమం నిర్వహిస్తున్నారు.
Admin
Studio18 News