Tuesday, 10 March 2026 02:10:59 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

కన్వర్ యాత్ర 2024: శ్రావణమాసంలో శివనామస్మరణతో నడక.. 15 రోజుల పాటు పరమ పవిత్రంగా కార్యక్రమం

Date : 22 July 2024 03:12 PM Views : 241

Studio18 News - భక్తి / : Kanwar Yatra 2024 date and routes: శ్రావణమాసం అంటేనే హిందువులకు పరమపవిత్రం. ఈ మాసంలో చాలామంది ప్రతిరోజు ఒక్కపూట భోజనం చేసి తర్వాత ఉపవాసం ఉంటుంటారు. ప్రత్యేక నియమాలతో పూజలు చేసేవాళ్లు ఉన్నారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా శ్రావణమాసం పూజలు, యాత్రలు, జాతరలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా యూపీలో జరిగే యాత్రే కన్వర్ యాత్ర. దీనికి చాలా ప్రత్యేకమైన నియమనిష్టలు ఉన్నాయి. కన్వర్ యాత్ర నాలుగు రకాలుగా ఉంటుంది. సాధారణ కన్వర్, డక్ కన్వార్, దండి కన్వార్, స్టాండింగ్ కన్వార్ అని ఉంటారు. శాఖాహారమే తీసుకోవాలి కన్వర్ యాత్ర చేసే భక్తులు కేవలం కాలినడకనే ప్రయాణించాలి. యాత్ర సమయంలో భక్తులు ఎలాంటి మాంసం, మద్యం తీసుకోకుండా.. శాఖాహారమే తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కావడిని నేలపై దించొద్దు. కావడి మోస్తూ నడుస్తున్నంత సేపు శివనామస్మరణ జపిస్తూ ఉండాలి. ఈ నిబంధనలు పాటిస్తూ కన్వర్ యాత్ర చేస్తుంటారు భక్తులు. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కాషాయ రంగు వస్త్రాలు ధరిస్తారు. భక్తి, విశ్వాసంతో దేవుడి మీద మనసు పెట్టి.. కేవలం భగవంతుడి నామం స్మరించుకుంటూ యాత్ర చేస్తే ఆ భోలేనాథుడి ఆశీర్వాదాలు ఉంటాయని చెబుతుంటారు. కావడిని భుజంపై మోస్తూ.. శివభక్తులు చాలా ఇష్టంతో భక్తిశ్రద్దలతో కన్వర్ యాత్ర చేస్తుంటారు. శ్రావణ మాసంలో మొదటి రోజు నుంచి పదిహేను రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా భక్తులు వెదురుతో శివుడి కోసం పల్లకిలు, తొట్లేల మాదిరిగా పల్లకీలు చేసి.. శివుడి ఫోటోపెట్టుకుని భుజంపై మోస్తూ యాత్ర చేస్తుంటారు. ప్రసిధ్ది చెందిన గంగానది ప్రవహించే పుణ్యస్థలాలకు నడుచుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత గంగా నదీ నుంచి జలాన్ని తీసుకుని శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. వందల ఏళ్లుగా ప్రతి ఏడాది ఈ పవిత్రమైన యాత్ర కొనసాగుతూనే ఉంది. కావడితో తీసుకొచ్చిన గంగా జలాన్ని శివలింగానికి సమర్పిస్తే తమ కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.ఉత్తరాది రాష్ట్రాల్లో భక్తులు ఈ కన్వర్ యాత్రను ఎక్కువగా చేస్తుంటారు. శ్రావణం అంటే శివుడికి ఇష్టమైన మాసంగా చెబుతుంటారు. ఈ మాసంలో శివుడికి గంగాజలాన్ని సమర్పిస్తే ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. శివభక్తులు భగవంతుడి అనుగ్రహం పొందటం కోసం ఈ మాసంలో కన్వర్ యాత్రను చేస్తారు. రాముడు, పరశురాముడు, రావణుడితో సహ ఎంతో మంది కన్వర్ యాత్ర చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.ముఖ్యంగా.. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రాంతాల నుంచి గంగా జలాన్ని తీసుకువస్తారు. ఈ ఏడాది జులై 22న ప్రారంభమై ఆగస్ట్ 6న ముగుస్తుంది కన్వర్ యాత్ర. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కన్వర్ యాత్రకు పెద్దఎత్తున అరేంజ్‌మెంట్స్ జరిగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :