Saturday, 14 December 2024 02:56:40 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Date : 09 October 2024 11:24 AM Views : 55

Studio18 News - భక్తి / : Dasara Navaratri Utsavalu 2024 at Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు (బుధవారం) మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తరువాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతా మూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. మూలా నక్షత్రం పురస్కరించుకొని భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి భక్తులు రానున్నారు. దీనికితోడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. అదనంగా 1100 మంది పోలీసులు, 110 హోల్డింగ్ టీంలు విధులు నిర్వర్తిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రికే భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుంచే కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :