Tuesday, 10 March 2026 02:08:22 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ .. ఎన్ని వచ్చాయంటే ..?

టీటీడీలో పునరుద్దరించబడిన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపార్సుల వీఐపీ బ్రేక్ దర్శనాలు ఆదివారం టీటీడీకి 90 మంది తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లే

Date : 24 March 2025 11:10 AM Views : 214

Studio18 News - భక్తి / : తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తొలి రోజే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు అందాయి. ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు ఈ సిఫార్సు లేఖలను జారీ చేశారు. ఈ సిఫార్సు లేఖలను నిన్న అదనపు ఈవో కార్యాలయ అధికారులు స్వీకరించారు. వీరికి ఈ రోజు (సోమవారం) వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించలేదు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వానికి ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. వీరి విజ్ఞప్తిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. మార్చి 24 (ఈరోజు) నుంచి గతంలో నిలిచిపోయిన ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :