Tuesday, 10 March 2026 02:05:58 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

Nail Cutting: ఏ రోజున గోర్లు కట్ చేస్తే మీ అదృష్టం దూరం అవుతుందో తెలుసా?

మన పూర్వీకులు కొన్ని చిన్న చిన్న ఆచారాలను పాటించడం ద్వారా శుభాన్ని, శ్రేయస్సును పొందవచ్చని నమ్మేవారు. అదే విధంగా, వారంలోని కొన్ని రోజులలో గోళ్లను కత్త

Date : 14 November 2025 07:02 PM Views : 158

Studio18 News - భక్తి / : హిందూ సంప్రదాయాల్లో ఎప్పటినుంచో కొన్ని విషయాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అందులో ఒకటి గోర్లు కత్తిరించడం. ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కత్తిరించడకూడదని మన పెద్దవాళ్లు సైతం చెప్తుంటారు. ఇందులో నిజమెంత?.. అసలు ఏ రోజుల్లో గోర్లు కత్తిరించాలి, ఎప్పుడు చేయకూడదు అనే విషయాలు ఇప్పటికీ చాలా మందికి సరైన అవగాహన లేదు. జ్యోతిష్య నిపుణులు శాస్త్రాల ప్రకారం, ఈ క్రింది నాలుగు రోజుల్లో గోర్లు కత్తిరించడం అశుభమని భావించాలి. శనివారం : శనివారం రోజున గోళ్లు కత్తిరించడం అనేది శని దేవుడికి కోపం తెప్పిస్తుందని నమ్మకం. ఇది శని దోషాన్ని పెంచుతుంది, తద్వారా జీవితంలో సమస్యలు, కష్టాలు పెరిగిపోతాయి. ఈ రోజు గోర్లు తీయడం వల్ల ఆర్థిక నష్టం లేదా వ్యాపారంలో నష్టం కలగడానికి అవకాశం ఉంది. మంగళవారం : మంగళవారం రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఆ ఇంట్లో రుణాలు పెరగడం, కోర్టు సమస్యలు రావడం జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మంగళవారం శక్తికి, ఉగ్ర రూపానికి సంబంధించిన రోజు; ఈ రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఇంట్లో అశుభాలు జరుగుతాయని భావిస్తారు. గురువారం : గురువారం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున గోళ్లు లేదా వెంట్రుకలు తీయడం వల్ల ఆయుష్షు తగ్గడం, అదృష్టం దూరం కావడం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ తప్పు చేయడం వలన ఇంట్లో ధనం నిలవదని, ధన నష్టం సంభవిస్తుందని నమ్మకం. అమావాస్య : ఏ నెలలోనైనా అమావాస్య రోజును అశుభంగా భావిస్తారు. ఈ రోజున గోళ్లు కత్తిరించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు పెరిగి, మానసిక ఒత్తిడి, భయం వెంటాడతాయి. ఈ కారణంగా లక్ష్మీదేవి కటాక్షం లోపిస్తుంది. గోళ్లు కత్తిరించడానికి శుభ దినాలు మరి దరిద్రాన్ని పారదోలి, శుభాన్ని పొందాలంటే గోళ్లను ఏ రోజుల్లో కత్తిరించాలి? గోళ్లు కత్తిరించడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం వంటి రోజులు శుభకరమైనవి. ముఖ్యంగా శుక్రవారం గోళ్లు కత్తిరించడం లక్ష్మీదేవికి సంతోషం కలిగిస్తుంది, తద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. గమనిక: ఈ సమాచారం పూర్తిగా భారతీయ శాస్త్రాలు, సాంప్రదాయ నమ్మకాలు మరియు జ్యోతిష్య చిట్కాల ఆధారంగా ఇవ్వబడింది. వ్యక్తిగత నమ్మకాలకు మాత్రమే పరిమితం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :