Wednesday, 30 April 2025 07:19:03 PM
# #tirupati : ప్రజాసమస్యల వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే # #guntoor : క్రీడా పోటీలను ప్రారంభించిన ఏవి నాగేశ్వరరావు # హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా..

ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు ..

శబరిమల వెళ్ళే భక్తులకు ఒకే నెంబరుతో అన్ని రకాల సేవలు

Date : 23 November 2024 11:40 PM Views : 204

Studio18 News - భక్తి / : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది నిష్టతో అయ్యప్ప మాల ధరిస్తారు. అంతే సంఖ్యలో శబరిమలలో స్వామివారిని దర్శించుకుని మాల విడుస్తారు. ప్రతి ఏటా అయ్యప్పల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో శబరిమలలో తరచుగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అంతేకాక 12 గంటల నుంచి 18 గంటల వరకు క్యూలైన్లలో నిలుచునే పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు.. ఎక్కడైనా ఏ సమస్యలోనైనా అయ్యప్ప భక్తులు చిక్కుకుంటే వెంటనే సహాయం అందించే విధంగా సాంకేతికత జోడించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టెక్నాలజీతో సేవలు అందిస్తున్నారు. శబరిమల ఉన్న పత్తనతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్ సౌకర్యానికి అంకురార్పణ చేశారు. అసలు శబరిమల భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, క్యూలైన్లు ఎందుకు పెరుగుతున్నాయి, పంబానది వద్ద, ఘాట్ రోడ్డు లో ఎందుకు భక్తులు ఆగిపోతున్నారు ఇలా వివిధ సమస్యలను పరిశీలించి, అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ వాట్సాప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్. శబరిమలకు వెళ్లే భక్తులు చేయాల్సినదల్లా సింపుల్గా 6238008000 ఈ నెంబర్ ని సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత వాట్స్అప్ లోకి వెళ్లి హాయ్ అని టైప్ చేస్తే వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఈ ఆరు భాషల్లో వాట్సప్ సమాచారం అందుతుంది. మీరు క్యూలైన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్న, ఆలయం సేవలు, ఏదైనా ప్రత్యేక సేవలు గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మీకు వచ్చేస్తుంది. అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీ, మీరు ఎక్కడైనా చిక్కుకున్న, శబరిమల వస్తున్న దారిలో మీ వాహనం చెడిపోయిన మీకు పోలీసులు వచ్చి వెంటనే సహాయం అందిస్తారు. దీంతోపాటు మీతో వచ్చిన భక్తులు ఎవరైనా తప్పిపోయిన వారిని వెతికేందుకు సహాయపడతారు. వాట్సాప్ లో మీ వివరాలు ఇవ్వగానే వెంటనే మీకు కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. అవతల వైపు నుంచి మీరు ఎంపిక చేసుకున్న భాషలో మాట్లాడినా మీ సమస్యని అర్థం చేసుకుంటారు. మీకు వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తారు.

Also Read : ఎన్నికల్లో గెలిచినా పదవి కోల్పోనున్న షిండే!

గతంలో ఎటువంటి ఎమర్జెన్సీ సిచువేషన్ ఉన్న డయల్ 100 కానీ, ఆలయం కాంటాక్ట్ నెంబర్ కానీ ఫోన్ చేయాల్సి వచ్చేది. దేశవ్యాప్తంగా వచ్చే లక్షలాది మంది భక్తులతో ఈ నెంబర్లు నిరంతరం బిజీగా ఉంటుండేది. దీంతో పాటు బాష సమస్య కూడా.. వీటన్నిటికీ చెక్ పట్టారు కలెక్టర్ ప్రేమ్ కుమార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సహాయంతో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొండపైన రద్దీని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునే అవకాశం ఇప్పుడు భక్తులకు లభించింది. ఎటువంటి సహాయం అయినా సింపుల్ వాట్సాప్ ద్వారా పోలీసులకు అందించే అవకాశం తీసుకువచ్చారు. నిజంగా శబరిమల కి వెళ్లే భక్తులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసారమవుతున్న STUDIO 18 NEWS చానల్ నందు పని చేయుటకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో జిల్లాల వారిగా స్టాఫ్ రిపోర్టర్లు, నియోజకవర్గాల వారిగా రిపోర్టర్లు వెంటనే కావలెను. తెలుగులో చదవటం, మాట్లాడటం, రాయడం వచ్చి, మీ స్థానిక సమస్యలపై అవగాహనతో పాటు 20 సంవత్సరాల వయస్సు దాటిన స్త్రీ, పురుష అభ్యర్థులు రిపోర్టర్లుగా చేరుటకు అవకాశం కల్పించబడుతుంది. అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కలదు. కొత్తగా మీడియా రంగంలోకి రావాలనుకునే వారికి సైతం అవకాశం. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలచే గుర్తింపు పొంది అక్రిడేషన్ సౌకర్యం కలిగిన సంస్థ. ISO 10002 : 2018 గుర్తింపు కలిగినది. అర్హులైన రిపోర్టర్లకు అక్రిడేషన్ కల్పించబడును. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ : 7799975556.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :