Tuesday, 10 March 2026 02:11:56 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి.. తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతం

Date : 05 January 2025 10:47 AM Views : 232

Studio18 News - భక్తి / Tirupati : తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని చెప్పారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు గుర్తించాలని అన్నారు. 10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండని తెలిపారు. టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు. 19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చని తెలిపారు. వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. అలిపిరి వద్ద నిర్మిస్తోన్న వైశ్రాయ్ హోటల్ పనుల నిలుపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు

Also Read : బీజేపీలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు..!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :