Tuesday, 10 March 2026 02:11:42 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

Ruchaka Yoga: అరుదైన యోగంతో వారు అపర కుబేరులయ్యే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా?

Ruchaka Maha Purusha Yoga: జ్యోతిషశాస్త్రంలో పంచ మహా పురుష యోగాలలో ఒకటైన రుచక యోగానికి చాలా ప్రధాన్యత ఉంది. కుజుడు తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశిలో సంచ

Date : 21 October 2025 07:57 PM Views : 177

Studio18 News - భక్తి / : జ్యోతిషశాస్త్రంలో పంచ మహా పురుష యోగాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. శశ, హంస, మాలవ్య, భద్ర, రుచక యోగాలనే ఈ అయిదు మహా పురుష యోగాల్లో ఏ ఒక్క యోగం పట్టినా వారు రారాజులు, అపర కుబేరులు అవుతారని, తమ తమ రంగాల్లో అగ్రస్థానాలకు చేరుకుంటా రని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శనిని బట్టి శశ యోగం, గురువును బట్టి హంస యోగం, శుక్రుడిని బట్టి మాలవ్య యోగం, బుధుడిని బట్టి భద్ర యోగం, కుజుడిని బట్టి రుచక యోగం కలుగుతాయి. ప్రస్తుతం కుజుడు తన స్వస్థానమైన వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల రుచక మహా పురుష యోగం(Ruchaka Maha Purusha Yoga) కలుగుతోంది. ఈ రాశిలో కుజుడు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 7 వరకు సంచారం చేయబోతున్నాడు. స్వస్థానంలో ఉన్న కుజుడు ఏ రాశికైనా 1, 4, 7, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు వారికి రుచక యోగం కలుగుతుంది. వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులకు ఈ యోగం కలిగింది. వృషభం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో కుజుడు స్వస్థానంలో సంచారం చేయడం వల్ల రుచక యోగం కలి గింది. అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల సంపన్న వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం తప్పకుండా జరుగుతుంది. వైవాహిక సమస్యలన్నీ పరిష్కారమై, అన్యోన్యత పెరుగుతుంది. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సింహం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో కుజుడు స్వస్థాన ప్రవేశం వల్ల రుచక మహా పురుష యోగం ఏర్ప డింది. ఈ యోగం వల్ల వీరికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నాకలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. సిరిసంపదలతో తులతూగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆస్తి లాభం కలుగుతుంది. వృశ్చికం: కుజుడికి ఇది స్వక్షేత్రం. ఈ రాశిలో కుజుడికి రుచక మహా పురుష యోగం కలుగుతుంది. ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. సగటు వ్యక్తి సైతం సంపన్నుడవుతాడు. అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకుంటారు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రాబల్యం, ప్రాధాన్యం కలుగుతాయి. కుంభం: ఈ రాశికి దశమ కేంద్రంలో కుజుడి స్వస్థాన స్థితి వల్ల రుచక మహా పురుష యోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ఒక సంస్థను నెలకొల్పే అవ కాశం కూడా ఉంది. వృత్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అంచనాలకు మించి లాభిస్తాయి. సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక విదేశీ ఆఫర్లు అందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :