Studio18 News - భక్తి / : Ganesh Chaturthi 2024 : దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కాలువుదీరి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ఇవాళ్టి నుంచి రాబోయే పదకొండు రోజులు దేశవ్యాప్తంగా వాడవాడల వినాయక నామస్మరణతో మారమోగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పలు ప్రాంతాల్లో ఉదయం, పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో గణపయ్యను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు ను ప్రారంభిస్తారు. అయితే, మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడి ముందే గుంజీలు ఎందుకు తీస్తారనేది ఆసక్తికరమైన అంశం. దీనికి పురాణాల్లో ఓ కథ కూడా ఉంది. వినాయకుడి ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు. దీని పరమార్థం వేరే ఉంది. ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడట. హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా, బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకొని మింగేశాడట. విష్ణువు వైకుంఠానికి వెళ్తూ సుదర్శన చక్రాన్ని వెతకగా.. గణపతి తాను మింగేశానని చెప్పాడు. నారాయణుడు ఎంత బతిమాలినా వినాయకుడు ఇవ్వలేదట. చివరకు మహావిష్ణువు కుడిచేత్తో ఎడమ చెవినీ, ఎడమ చేత్తో కుడి చెవినీ పట్టుకొని గుంజీలు తీశాడట. అదిచూసి గణపతి పడీపడీ నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది. గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు. నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది. ఇలా చేయడం వల్ల మెదడూ చెరుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలూ చెబుతున్నారు.
Admin
Studio18 News