Tuesday, 10 March 2026 03:42:54 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుమలలో గౌరవం దక్కడం లేదని, మా సిఫార్సు లేఖలు అనుమతించడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

Date : 14 March 2025 02:23 PM Views : 292

Studio18 News - భక్తి / : తిరుమల: తెలంగాణ ప్రజాప్రతినిధులకు తిరుమలలో సమస్యలు తప్పడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి తయారైంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరుమలలో పట్టించుకోవడం లేదు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకున్న అనంతరం రఘునందన్ రావు పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఇచ్చే సిఫార్సులను తిరుమలలో తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమలవుతుందని ఏపీ ప్రభుత్వం, టీటీడీ సైతం తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి అనుమతి ఇచ్చేవారు. కానీ రాష్ట్ర విభజన నుంచి తిరుమలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరుమలలో కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణనలోకి తీసుకుంటుంది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిఫార్సులను ఆమోదిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సైతం చెప్పారు. లేఖలు ఇవ్వండి, అకామడేషన్ ఇస్తామంటారు. లేఖలు సిఫార్సు చేస్తే పరిగణనలోకి తీసుకోవడం లేదు. మార్చి నెల సగం పూర్తయింది. ఇంకా తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలతో వచ్చే వారికి ఎలాంటి అనుమతి, సదుపాయాలు కల్పించడం లేదు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఉమ్మడి ఏపీలో 294 మంది సిఫార్సు లేఖలు ఆమోదించిన టీటీడీ.. ఇప్పుడు కేవలం ఏపీ నేతల లేఖల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి’ అని ఎంపీ రఘునందన్ రావు కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :