Tuesday, 10 March 2026 02:04:53 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

Watch Video: కార్తీక మాసంలో మావుళ్ళమ్మ తల్లికి వెయ్యి కేజీల సారె సమర్పణ..! రేపు పడి పూజోత్సవం..

మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామదేవత. సాధారణంగా గ్రామదేవతలకు ఆషాడ మాసంలో సారెను సమర్పిస్తారు భక్తులు. కానీ ఈ‌సారి కార్తీకమాసంలో ప్రత్యేకంగా మావుళ్ళమ్మ

Date : 14 November 2025 07:34 PM Views : 112

Studio18 News - భక్తి / : ఏలూరు, నవంబర్‌ 9: మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామదేవత. సాధారణంగా గ్రామదేవతలకు ఆషాడ మాసంలో సారెను సమర్పిస్తారు భక్తులు. కానీ ఈ‌సారి కార్తీకమాసంలో ప్రత్యేకంగా మావుళ్ళమ్మ అమ్మవారికి 1000 కేజీల సారెను సమర్పించారు మావుళ్ళమ్మ మాలధారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మావుళ్ళమ్మ మాలధారణ దీక్షాపరులచే అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవముగా జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్షాదారులు సుమారు 1000 కేజీల పలురకాల స్వీట్స్, పిండివంటలతో సారెను ఏర్పాటు చేసారు. పండ్లు, పువ్వులు, 115 కేజీల బారి లడ్డుతో మావుళ్ళమ్మ అమ్మవారి పూరిగుడి నుంచి పట్టణంలోని ఊరేగింపు చేసారు. మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయానికి చేరుకుని సారెను అమ్మవారికి వైభవంగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ భక్తులు తెచ్చిన సారెను తీసుకుని సంప్రోక్షణ జరిపి మావుళ్ళమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సమర్పణ చేశారు. రేపు నవంబర్ 9 తేదీన సాయంత్రం 6 గంటలకు మావుళ్ళమ్మ మాలధారణ దీక్షదారుల పడి పూజ అత్యంత వైభవంగా జరుగుతుందని భక్తులు తరలి వచ్చి, ఈ కార్యక్రమం చూసి తరించాలని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :