Tuesday, 10 March 2026 03:41:51 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Navaratri 2024: అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?

Date : 09 October 2024 05:19 PM Views : 252

Studio18 News - భక్తి / : Navaratri 2024 : చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా మనం దసరా పండుగ జరుపుకుంటాం. అయితే అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు వేటికి ప్రతీకనో మీకు తెలుసా? బ్రహ్మదేవుడి నుంచి వరం పొందిన మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపడతాడు. దిక్కులేని పరిస్థితుల్లో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకుంటాడు. మహిషునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజస్సుగా మారింది. త్రిమూర్తులు కలిసి స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా అమ్మవారు 18 చేతులతో అవతరించింది. శివుడి శూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మ అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహాన్ని ఇచ్చారు. ఇలా సకల దేవతలు ఇచ్చిన ఆయుధాలు అమ్మవారి చేతిలో కనిపిస్తాయి. శంఖం: శంఖం ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని సూచిస్తుంది. ధనుర్భాణాలు: ఇవి శక్తి ని సూచిస్తాయి. ధనుర్భాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గా మాత తాను స్థితి గతి శక్తులు రెండింటి మీదా అధికారం కలిగియున్నానని చెబుతుంది. ఈటె: అగ్ని దేవుడు దుర్గామాతకు ఇచ్చిన ఆయుధం ఈటె. శక్తికి, శుభానికి దీనిని చిహ్నంగా భావిస్తారు. చెడు, మంచి వ్యక్తుల మధ్య బేధానికి ఇది ప్రతీక. గొడ్డలి: విశ్వకర్మ మహాముని ఇచ్చిన గొడ్డలిని చెడుతో పోరాటానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయపడకూడదని ఇది సూచిస్తుంది. గద: అమ్మవారి చేతిలో ఉండే గద ధృడ సంకల్పానికి ప్రతీక. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని అర్ధం. సుదర్శన చక్రం: సుదర్శన చక్రం దుర్గా మాత ఆజ్ఞకి ఈ విశ్వం అంతా లోబడి నడుస్తుందని అర్థం. ఖడ్గం: అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గం..పదునైన జ్ఞానాన్ని సూచిస్తుంది. త్రిశూలం: మూడు గుణాలైన సత్వ ,రజో , తమో గుణాలకి ప్రతీక త్రిశూలం . శారీరక,మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గా మాత తొలగిస్తుంది. వజ్రాయుధం: ఇంద్రుడు ఇచ్చిన వజ్రాయుధ శక్తి, బలమైన సంకల్ప శక్తికి సూచనగా నిలుస్తుంది. అభయముద్ర: దుర్గాదేవి అభయాన్ని ఇస్తూ సింహం మీద నిలుచుని ఉంటుంది. మీ భయాలు, భారాలు అన్నీ నా మీద వేయండి.. నేను మోస్తాను.. అన్నట్లు అమ్మవారు భక్తులకు అభయమిస్తున్నట్లు అర్థం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :