Studio18 News - భక్తి / : Navaratri 2024 : నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీ దేవిగా దర్శనం ఇస్తున్నారు. చండీ దేవి అమ్మవారు ఒక్కోసారి శాంతంగా ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు. శాంతంగా.. దయగల రూపంలో ఉన్న అమ్మవారిని గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, శాకంభరి దేవీ, జగన్మాత, భవాని అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్నప్పుడు దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అని పిలుస్తారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ఈరోజు ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. పసుపు రంగు పూవులతో పూజ చేస్తారు. చండీ, దుర్గా సప్తశతి చదివితే మంచిది. అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టాలి. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది. హరిద్వార్ లో ఉన్న చండీ దేవీ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడింది. ఇక్కడ ఆలయంలో విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్టించారని చెబుతారు. నవరాత్రుల్లో అష్టమి, నవమిలలో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల్లో శ్రీ మహా చండీ దేవిని దర్శించుకుంటే మనసులోని కోర్కెలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు.
Admin
Studio18 News