Tuesday, 10 March 2026 02:11:42 PM
# శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

రెండు గంటల్లో శ్రీవారి దర్శనం... ఏఐ టెక్నాలజీని పరిశీలించిన టీటీడీ సభ్యులు

భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం చర్యలు తీసుకుంటున్న టీటీడీ బీఆర్ నాయుడిని కలిసిన రెండు ఏఐ సంస్థల ప్రతినిధులు

Date : 24 December 2024 04:10 PM Views : 230

Studio18 News - భక్తి / : తిరుమలకు వచ్చే భక్తులకు తక్కువ సమయంలోనే శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ పాలకమండలి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీఆర్ నాయుడు ఈ అంశంలో చొరవ చూపిస్తున్నారు. బీఆర్ నాయుడు... రెండు ఏఐ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. Aaseya, Ctruh సంస్థలు సంయుక్తంగా అభివృద్ది చేసిన ఏఐ మోడల్ ను బీఆర్ నాయుడు, టీటీడీ సభ్యులు ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ విధానంలో తొలుత... భక్తుడి ఫేస్ రికగ్నిషన్ రికార్డ్ అయ్యాక, ఓ కియోస్క్ నుంచి టోకెన్ (బార్ కోడ్ స్లిప్) వస్తుంది. అందులో భక్తుడి వివరాలు, దర్శనం సమయం ఉంటాయి. నిర్దేశిత సమయానికి భక్తుడు క్యూలైన్ ఎంట్రీ వద్దకు వెళితే ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ఆటోమేటిగ్గా గేటు తెరుచుకుంటుంది. ఈ విధానాన్ని ఆ రెండు సంస్థల ప్రతినిధులు టీటీడీ సభ్యుల ముందు డెమో ఇచ్చారు. తాజాగా ప్రజంటేషన్ ఇచ్చిన రెండు కంపెనీలు (Aaseya, Ctruh) 14 దేశాల్లో ఏఐ సంబంధిత సేవలు అందిస్తున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శ్రీవారి దర్శనం అంశంలో ఏఐ టెక్నాలజీ అందిస్తామంటూ మరికొన్ని సంస్థలు కూడా ముందుకొస్తున్నాయని, వాళ్ల కాన్సెప్టులు కూడా పరిశీలించిన తర్వాత, మేలైన విధానాన్ని ఖరారు చేస్తామని తెలిపారు.

Also Read : 10 కోట్ల సినిమాకి 55 కోట్ల వసూళ్లు!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :