Tuesday, 10 March 2026 02:05:58 PM
# ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ # హయత్‌నగర్ వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా # వనస్థలిపురంలో బీఆర్‌ఎస్ నాయకుడు చింతల రవి కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా

Money Plant Vastu: మీ ఇంట్లో మనీ ప్లాంట్‌ ఇలా పెంచారంటే.. అప్పులు తీరి, మంచిరోజులు వచ్చినట్టే..!

చాలా మంది తమ ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. అపార్ట్‌ మెంట్లు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నవారు కూడా ఎండ, నీళ్లు ఎక్కువగా అవసరం ల

Date : 14 November 2025 07:15 PM Views : 89

Studio18 News - భక్తి / : ఇంట్లో మనీప్లాంట్‌ని పెంచుతున్నవారు తప్పనిసరిగా వాస్తుప్రకారం ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినది. ఇది శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి మొదలైన వాటికి కారకంగా చెబుతారు. ఇంట్లో సరైన దిశలో మనీ ప్లాంట్ ఉంటే శుక్రుడు కూడా సంతోషిస్తాడని, తద్వారా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని చెబుతారు. మనీ ప్లాంట్‌ ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే, ఆ మొక్క దాని ప్రయోజనాలను అంతలా అందిస్తుంది. 1 / 5

మనీ ప్లాంట్ మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో నాటాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..ఇంటికి ఆగ్రేయ దిశకు అధిపతి వినాయకుడు, ప్రతినిధి శుక్రుడు. గణేశుడు అన్ని కష్టాలు, అడ్డంకులను తొలగిస్తాడు. శుక్రుడు ఇంట్లో సంపద, శ్రేయస్సు, గౌరవాన్ని పెంచుతుంది. అందుకే ఈ మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల ఆగ్నేయ దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయని నమ్మకం. 2 / 5 అలాగే, మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదని చెబుతున్నారు. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ దిశకు అధిపతి బృహస్పతి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినది. బృహస్పతి, శుక్ర గ్రహాల మధ్య చెడు సంబంధం కారణంగా, ఇంట్లో ఈ దిశలో నాటిన మనీ ప్లాంట్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు. 3 / 5

ఇకపోతే, మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతుంటే, వాటిని వెంటనే తొలగించాలని చెబుతున్నారు. మొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్లనివ్వండి. తీగను పెంచడం సంపద, శ్రేయస్సును ఇస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ తీగ నేలపై ఉంటే, ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది . శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది. 4 / 5 మీరు పనిచేస్తున్న చోట, ఆఫీసు కార్యాలయంలోనూ ఈ మనీ ప్లాంట్ పెంచుకోవచ్చు. దీని కోసం, ఆకుపచ్చ, నీలం గాజు సీసాలో ఈ మొక్కను పెంచండి. ఈ విషయాలు డబ్బును ఆకర్షిస్తాయి. పురోగతికి కొత్త మార్గాలను సృష్టిస్తాయి. అదే సమయంలో, ఈ మొక్కను ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. అయితే, ఈ మనీ ప్లాంట్​ మొక్కను ఎవరికీ ఇవ్వకూడదని అంటున్నారు. ఇలా చేస్తే శుక్రుడికి కోపం వస్తుందని అంటున్నారు. ఫలితంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. 5 / 5

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :