Thursday, 26 March 2026 04:59:36 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Ram Charan: రామ్‌‍చరణ్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

Date : 25 March 2026 03:07 PM Views : 7

Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / HYDERABAD : 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు రామ్‌చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా చిత్రీకరణ సందర్భంగా రామ్‌చరణ్ గాయపడ్డారని తెలిసిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు జనసేన పార్టీ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేసింది. రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్రీకరణ సందర్భంగా రామ్‌చరణ్‌కు స్వల్పగాయమైంది. ఆయన కంటి దగ్గర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చిన్న గాయమేనని, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది. రామ్‌చరణ్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :