Tuesday, 10 March 2026 03:49:08 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

AP TOP NEWS @ 5PM

Date : 26 July 2025 05:32 PM Views : 474

Studio18 News - తాజా వార్తలు / AMARAVATI : 1. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో చోరీలకు పాల్పడుతూ ఓ ఆగంతకుడు సీపీ కెమేరాకు చిక్కాడు. స్థానిక మార్కెట్ సెంటర్‌లో ఉన్న సంగం డెయిరీ పార్లర్‌ వద్ద ప్రతిరోజూ తెల్లవారుజామున సంగం డెయిరీకి చెందిన పాల వాహనం పెరుగు, పాల ప్యాకెట్లను అన్ లోడ్ చేసి వెళ్తుంది. ఆ తరువాత కొంత సేపు తరువాత వస్తున్న సంగం డెయిరీ నిర్వాహకుడు రాఘవ సరుకు వివరాలను సరిచేసుకునే క్రమంలో పాలు, పెరుగు లెక్కల్లో తేడా కనిపిస్తుండటంతో, సీపీ కెమేరాలను పరిశీలించగా, ప్రతిరోజు ఓ వ్యక్తి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించాడు. అనంతరం నిఘా ఉంచి సీసీ కెమేరాలో దొంగ మొహాన్ని స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేశాడు. సదరు దొంగను నిడుబ్రోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించి, పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. 2. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం లోని బి. ఆర్. డి ఆసుపత్రి నందు ఆదివారం ఉచిత మెగా వైద్య పరీక్ష శిబిరం నిర్వహించనున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బి.ఆర్. డి ఆసుపత్రి చైర్మన్ డా. సురేష్ బాబు లయన్స్ అప్ కుప్పం వారియర్స్, బ్రెయిన్స్ హాస్పిటల్, అల్టియస్ హాస్పిటల్, బెంగళూరు వారి సౌజన్యంతో కుప్పం బి.ఆర్.డి ఆసుపత్రి నందు నిర్వహించే ఈ శిభిరం ద్వారా పలు రకాల వ్యాధులకు ఉచితంగా పరిక్షలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 3. తిరుపతి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, నాయుడుపేట ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అండర్‌ -15 బాలికల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను నాయుడు పేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలను లూథరన్‌ చర్చి బిషఫ్‌ మైఖెల్‌ బెన్‌హర్‌, తిరుపతి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ పోటిల్లో రాష్ట్ర స్థాయిలో 8 జోన్‌లకు సంబంధించి 7 జట్లు పాల్గొనడం జరుగుతుందన్నారు. నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. 4. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం సహకార సంఘాలకు ఎట్టకేలకు ఏడాది కాలం తర్వాత ఎన్నికల నగారా మోగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఈ మేరకు మండలాల్లో సహకార కేంద్రాల పరిధిలో ఎవరెవరిని డైరెక్టర్లు చైర్మన్లుగా నియమించాలో స్థానిక నేతలతో చర్చించి వడపోత కార్యక్రమం అనంతరం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు అధిష్టానం నుండి చైర్మన్లు, డైరెక్టర్ల అధికారిక జాబితా రావడంతో సంబంధిత అధికారుల సమక్షంలో పలువురు చైర్మన్లు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 5. బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న రోడ్డులో వివిధ మోటార్ మెకానిక్ దుకాణాలను చిన్న చితక హోటల్స్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ముస్లిం మైనారిటీల వారికి దుకాణాలు తొలగించమని చీరాల మునిసిపల్ సిబ్బంది నోటీసులు జారీ చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ, రోడ్డు ప్రక్కనే చిన్న చిన్న మెకానిక్ షెడ్లు,హోటల్స్ నిర్వహించుకుంటు కుటుంబాలను పోషించుకుంటున్నామని... ఈరోజు మునిసిపల్ శాఖ అధికారులు వచ్చి ఈ దుకాణాలు తొలగించాలని అంటూ ఒక హోటల్ ని కూల్చివేశారని వాపోయారు. తమ దుకాణాలు ఏవీ కూడా ట్రాఫిక్ కి అడ్డుగా లేవని.... ఇప్పటికిప్పుడు తొలగిస్తే తామెలా బ్రతకాలి అంటూ వాపోయారు.

6. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో. న్యూ పెట్ వాలీబాల్ క్లబ్ ఆధ్వర్యంలో. అంబేద్కర్ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టిటిడి బోర్డు సభ్యులు శాంతారామ్, గోపీనాథ్ మున్సిపాలిటీ కమిషనర్, శ్రీనివాసరావు కొత్తపేట ఇన్చార్జ్ అప్పు, మంజునాథ్ పాల్గొని లాంచనంగా టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ పోటిలలో విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫిలను అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 7. చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న 69 ఆశా వర్కర్ల పోస్టులకు చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 69 ఖాళీలకు గాను 174 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధారాణి వెల్లడించారు. ఇంటర్వ్యూ కు హాజరైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత ఉన్న వారికి నియామకపత్రాలను అందిస్తామని వెల్లడించారు. 8. కార్గిల్ విజయోత్సవ దినోత్సవాని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద మాజీ సైనికులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రాజన్ మాట్లాడుతూ భారతదేశం స్వేచ్ఛ వాయువులు కోసం అహర్నిశలు దేశ సరిహద్దుల్లో కాపలాకాసి దేశం కోసం అమరులైన యుద్ధ వీరులను స్మరించుకోవడం ఎంతైనా అవసరమని అన్నారు. ఈ మేరకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నుండి ర్యాలీగా ఎన్టీఆర్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద ఉన్న జవాన్ స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్గల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు జిల్లా మాజీసైనిక సంక్షేమ శాఖఅధికారి రాఘవులు ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. అనంతరం యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులకు సన్మానం చేసి అవార్డులను అందించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :