Tuesday, 10 March 2026 03:43:57 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Hidma: లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్‌కౌంటర్‌కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ!

Date : 19 November 2025 07:48 PM Views : 95

Studio18 News - తాజా వార్తలు / : మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతిలో కీలక పరిణామం మరణానికి పది రోజుల ముందు జర్నలిస్టుకు లేఖ రాసిన వైనం భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ వెల్లడి ఆయుధాలు వీడేలోపే ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి, లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. లొంగిపోయే ముందు కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని కూడా తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే హిందీ, తెలుగు భాషల్లో ఆడియో సందేశం విడుదల చేస్తామని కూడా హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో తనను కలవాలని సదరు జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం. అయితే, లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే, నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మరణించడం గమనార్హం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :