Tuesday, 10 March 2026 03:45:36 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Date : 24 March 2025 03:39 PM Views : 221

Studio18 News - తాజా వార్తలు / : Betting apps: బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు, నిర్వాహకులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పీఎస్ లో విచారించిన ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ నుంచి సేకరించిన సమాచారంతో మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్లు పేర్కొంటూ పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

బెట్టింగ్ కేసులో యాప్స్ నిర్వాహకులే లక్ష్యంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 19మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. ఇల్లీగల్ బెట్టింగ్ కు నిర్వాహకులే బాధ్యులు అని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వారందరిని నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్లలో కొందరి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. మరికొందరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్ చేసిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో వారిని, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ను ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతో పాటు తదితరులు ఉన్నారు. మరోవైపు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురిపై కేసులు నమోదు కాగా.. వారిలో టీవీ యాంకర్ విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు ఇప్పటికే విచారించారు. వైసీపీ మహిళా నేత, టీవీ యాంకర్ శ్యామలను పోలీసులు ఈరోజు పంజాగుట్ట స్టేషన్ లో విచారించారు. మరికొందరికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. వారిని కూడా రెండు మూడు రోజుల్లో విచారించే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :