Tuesday, 10 March 2026 03:50:44 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

Posani Krishna Murali: పోసానికి ఊరట... సీఐడీ కేసులో బెయిల్ మంజూరు

పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు ఏపీలో పోసానిపై 19 కేసులు కూటమి ప్రభుత్వం వచ్చాక పోసానికి తిప్పలు!

Date : 21 March 2025 05:42 PM Views : 183

Studio18 News - తాజా వార్తలు / : ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట కలిగింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఐడీ నమోదు చేసిన కేసులో పోసానికి బెయిల్ లభించింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై గుంటూరు కోర్టు బుధవారం విచారణ జరిపి తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. తిరిగి నేడు విచారణ జరిపి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ న్యాయవాదుల ద్వారా సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా, పోసానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఏపీలో ఆయనపై 19 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అవార్డులకు సంబంధించిన సినీ పరిశ్రమలో విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేశారని... చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :